రాములమ్మ కారణంగా జగపతిబాబు తప్పుకున్నాడా?

మహేష్‌ బాబు 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి జగపతిబాబు తప్పుకున్న విషయం తెల్సిందే. మొదట ఈ చిత్రం నుండి జగపతిబాబు తప్పుకోవడంకు కారణం అనీల్‌ రావిపూడి అంటూ వార్తలు వచ్చాయి. అనీల్‌ రావిపూడికి జగపతిబాబుకు ఒక సీన్‌ విషయంలో గొడవ జరిగిందని, అది కాస్త పెరిగి పెద్దగవ్వడంతో జగపతిబాబు మొత్తంగా సినిమా నుండి తప్పుకున్నట్లుగా టాక్‌ వినిస్తుంది. అయితే తాజాగా జగపతిబాబు మరియు అనీల్‌ రావిపూడిలు విడి విడిగా స్పందిస్తూ ఎలాంటి వివాదం లేదని, అయితే చిన్న కారణం వల్ల తప్పుకున్నట్లుగా జగపతిబాబు చెప్పగా, అనీల్‌ రావిపూడి మాత్రం జగపతిబాబు గారితో భవిష్యత్తులో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు.

ఈ సమయంలోనే జగపతిబాబు సరిలేరు నీకెవ్వరు నుండి తప్పుకోవడం గురించి కొత్త వార్తలు పుట్టుకు వచ్చాయి. ఆ వార్తలను బట్టి ఈ చిత్రంలో విజయ శాంతి పాత్ర కంటే తన జగపతిబాబు పాత్ర తక్కువ ఉందట. దాంతో పాటు జగపతి బాబును డామినేట్‌ చేసే విధంగా రాములమ్మ పాత్ర ఉంటుందని, అందుకే జగపతిబాబు ఈ చిత్రం నుండి తప్పుకున్నాడనే టాక్‌ కూడా వినిపిస్తుంది. జగపతిబాబు స్థానంలో ప్రకాష్‌ రాజ్‌ ఎంపిక అయిన విషయం తెల్సిందే. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న ప్రకాష్‌ రాజ్‌ ఈ చిత్రంకు తప్పకుండా ప్లస్‌ అవుతాడనే టాక్‌ వస్తోంది. ఈ చిత్రంకు విజయశాంతి కీలకం కనుక జగపతిబాబు తప్పుకున్నా పర్వాలేదనుకుని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకాష్‌ రాజ్‌ను ఆయన స్థానంలో తీసుకున్నారని తెలుస్తోంది.