Site icon TeluguMirchi.com

బాబు.. పండ‌గ చేస్కోవ‌డం లేదు

jagapathi-babu

లెజెండ్ త‌ర‌వాత ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల‌కు ప్ర‌ధాన ఆప్ష‌న్ గా మారిపోయాడు జ‌గ‌ప‌తిబాబు. మ‌హేష్ బాబు ‘ఆగ‌డు’ చిత్రంలో ఆఫ‌ర్ అందుకొన్నాడు. మంచు మనోజ్ తాజా సినిమాలోనూ జ‌గ‌ప‌తినే ప్ర‌తినాయ‌కుడు. రామ్ – గోపీచంద్ ఆచంట కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలోనూ జ‌గ‌ప‌తిబాబే ప్ర‌తినాయ‌కుడు.. అన్నారంతా. సంప్ర‌దింపులు కూడా జ‌రిగిపోయాయని, భారీ పారితోషికానికి జ‌గ‌ప‌తి ప‌డిపోయాడ‌ని చెప్పుకొన్నారు. అయితే ఈ సినిమాలో జ‌ప‌గ‌తి బాబు న‌టించ‌డం లేద‌ట‌. అలాంటి ఆఫ‌ర్ ఏదీ త‌న వ‌ర‌కూ రాలేదు.. అంటున్నాడు జ‌గ‌ప‌తిబాబు. దానితో పాటు మ‌హేష్‌, మ‌నోజ్‌ల సినిమాల్ని క‌న్‌ఫామ్ చేశాడు. ప్రస్తుతం పిల్లానువ్వులేని జీవితం, రారా కృష్ణ‌య్య సినిమాల్లో న‌టిస్తున్నాడు జ‌గ‌ప‌తిబాబు. ఈ షేడ్యూల్స్ పూర్త‌య్య‌యి కూడా. త్వ‌ర‌లోనే ఆగ‌డు సెట్స్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు ఈ స‌రికొత్త విల‌న్‌.

Exit mobile version