అదరగొడుతున్న ‘జగ్గు భాయ్ ‘ లుక్…

jagapathi-babu-Srimanthuduజగపతి బాబు ఫ్యామిలీ హీరో నుండి విలన్ కు షిఫ్ట్ అయిన జగ్గు భాయ్..తాజాగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు’ అనే చిత్రం లో ముఖ్య పాత్రలలో నటిస్తున్నాడు. మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం లో జగపతి బాబు, మహేష్ లు ఇద్దరు ఓ రిచ్ లేవలో కనిపించబోతున్నారట.

అంతే కాకుండా సుకన్య మరియు బెంగాలీ నటి అంగన మరో ప్రదాన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం మలేషియా లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై లో ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన అధ్బుతమైన మ్యూజిక్ అందించబోతున్నాడు. మైత్రి మూవీస్ ఫై ఈ చిత్రం రాబోతుంది.