Site icon TeluguMirchi.com

మరో క్రేజీ ప్రాజెక్ట్ లో జగపతి..

జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఎన్నో ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా జగపతి బాబు సినీ రంగప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తరువాత మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు. ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన, మొదట హీరోగా రాణించి , ప్రస్తుతం విలన్‌ గా టర్న్‌ తీసుకుని బిజీ యాక్టర్ అయ్యాడు. తెలుగు ,తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్న జగపతి , ఇటీవల రంగస్థలం లో అద్భుతమైన నటనను కనపరిచి యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన చిరంజీవి సైరా , బాలకృష్ణ యన్.టి.ఆర్ సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు తమిళ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన ‘లింగ’ లో, మోహన్‌ లాల్ ‘పులిమురుగన్‌’ చిత్రాల్లో నటించిన ఈయన , తాజాగా సూర్య సినిమాలో నటించే ఛాన్స్ దక్కినట్లు సమాచారం. దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఎన్జీకే’ సినిమాలో జగపతి బాబు నటించబోతున్నాడు.

ఈ మూవీ లో నెగిటివ్ రోల్ లో జగపతి కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈయన ఫై సన్నివేశాలు షూట్ చేస్తున్నారట. ఈ మూవీ లో సూర్య సరసన రకుల్ ప్రీతీ సింగ్ , సాయి పల్లవి జోడి కడుతున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా , డ్రీం వారియర్ పిక్చర్స్ ఫై ప్రకాష్ బాబు, ప్రభు లు ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version