మెగా సినిమాలో జ‌గ‌ప‌తిబాబు

Pilla-Nuvvu-Leni-Jeevitham-Movie-Wallpapers-Posters-1_S_508శ్రీ‌హ‌రి లేని లోటుని జ‌గ‌ప‌తిబాబు కొంత వ‌ర‌కూ తీరుస్తున్నార‌నే చెప్పాలి. అలాంటి ప‌వ‌ర్‌ ఫుల్ పాత్రలిప్పుడు… జ‌గ‌ప‌తిబాబు చెంత‌కు చేరుతున్నాయి. లెజెండ్‌ లో బాల‌య్యను ఢీ కొట్టే పాత్రలో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు. అదికాకుండా రారా కృష్ణయ్యలోనూ సందీప్‌ కిష‌న్‌ కి అన్నయ్యగా క‌నిపించ‌బోతున్నారు. ఇప్పుడు ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో ఓ కీ రోల్ ద‌క్కింది. చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రమిది. ‘రెజీనా’ నాయిక‌. శ్రీ‌హ‌రి కీల‌క పాత్ర పోషించారు. అయితే శ్రీ‌హ‌రి హ‌ఠాన్మర‌ణంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ ప‌డింది. ఆ పాత్ర జ‌గ‌ప‌తిబాబుతో భ‌ర్తీ చేయించారు. షూటింగ్ కార్యక్రమాల‌ను ముగించుకొన్న ఈ చిత్రం త్వర‌లోనే విడుద‌ల కాబోతోంది. శ్రీ‌హ‌రి ప్లేసుని జ‌గ‌ప‌తి ఎంత వ‌ర‌కూ భ‌ర్తీ చేశాడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.