Site icon TeluguMirchi.com

హాలీవుడ్ చిత్రం లో జగపతిబాబు…

Jagapathi-Babu-turns-malayaఫ్యామిలీ హీరో గా మంచి గుర్తింపు పొందిన జగపతి బాబు , ఇప్పుడు విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు భాషలలో నటిస్తూ బిజీ అయ్యాడు..తాజాగా హాలీవుడ్ చిత్రానికి జగపతి బాబు పనిచేయబోతున్నాడు.. జురాసిక్ పార్క్, అవతార్ వంటి భారీ హిట్స్ ఇచ్చిన స్టీఫెన్ స్పీల్ బర్గ్ చిత్రానికి డబ్బింగ్ చెప్పబోతున్నాడు..

స్టీఫెన్ స్పీల్ బర్గ్ తాజా చిత్రం ‘ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్’ చిత్రం త్వరలో భారత్ లో విడుదలచేయనున్నారు. ఈ చిత్రం లో ముఖ్యమైన క్యారెక్టర్ కు మన జగపతి బాబు డబ్బింగ్ చెప్పనున్నారు. డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 15 న దేశ వ్యాప్తం గా రిలయన్స్ వారు విడుదల చేయనున్నారు.

Exit mobile version