స్టార్లందరిపై హిట్‌ విలన్‌ సెటైర్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రం టాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది. అయిదు భాషల్లో ఈ చిత్రానికి మంచి డిమాండ్‌ ఉందనే చెప్పవచ్చు. సురేందర్‌ ఈ చిత్రాన్ని  ప్రత్యేకంగా తీసుకుని మరీ తెరకెక్కించారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో ‘సైరా’ను నిర్మించారు. ఈ సందర్భంగా సీనియర్‌ హీరో, హిట్‌ విలన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న జగపతిబాబు స్టార్‌ హీరోలందరిపై ఓ సెటైర్‌ వేశారు.

వేదిక మీదకు వచ్చిన అనంతరం జగపతిబాబు మైక్‌ పట్టుకుని మెగాస్టార్‌, పవర్‌స్టార్‌ ఆల్‌ కైండ్‌ ఆఫ్‌ గిగాస్టార్స్‌ అంటూ సంభోదించారు. సమయం లేకపోవడం వల్ల అందరిని విష్‌ చేయడానికి ఈ పదం వాడాడు. కానీ సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఆల్‌ కౌండ్‌ ఆఫ్‌ గిగాస్టార్స్‌ అనే పదం బాబు కావాలనే అన్నాడా? లేక హాడావుడిలో అన్నాడా? అని మెగా అభిమానులు రచ్చ చేస్తున్నారు. అయితే బాబు మాత్రం దీన్ని సెటైరికల్‌గా కాకుండా సమయం లేకపోవడం వల్ల ఏదో తొందర్లో అనొచ్చు అని బాబు అభిమానులు చెప్పుకొస్తున్నారు.