లెజెండ్ పుణ్య‌మా అని…

legend-first-week-collectio

లెజెండ్ హిట్‌ ని, ఆ సినిమాతో వ‌చ్చిన పేరుని జ‌గ‌ప‌తిబాబు క్యాష్ చేసుకొంటున్నాడో లేడో గానీ, జ‌గ‌ప‌తిబాబు నిర్మాత‌లు మాత్రం ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉన్నారు. షూటింగ్ పూర్త‌యినా విడుద‌ల కాకుండా ల్యాబుల్లోనే మూలుగుతున్న‌ పాత సినిమాల బూజు దులిపి విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. జ‌గ‌ప‌తిబాబు – భూమిక క‌ల‌సి న‌టించిన చిత్రం ఏప్రిల్ ఫూల్‌. కె.ఎస్‌.ఐ ద‌ర్శ‌కుడు. జీ.ఎల్ శ్రీ‌నివాస్ నిర్మాత‌. రెండేళ్ల క్రిత‌మే ఫ‌స్ట్ కాపీ రెడీ అయ్యింది. త్వ‌ర‌లో విడుద‌ల‌.. త్వ‌ర‌లో విడుద‌ల అంటూ ఈ సినిమాని నానుస్తూ వ‌చ్చారు. జ‌గ‌ప‌తిబాబుకి వ‌రుస ఫ్లాపులు రావ‌డం, అత‌ని మార్కెడ్ ఢ‌మాల్‌మ‌న‌డంతో ఈ సినిమాని ప‌క్క‌న పెట్టేశారు. లెజెండ్‌ తో ఇప్పుడు జ‌గ‌ప‌తికి కాస్త ఊపొచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోవాల‌న్న ఉద్దేశంతో నిర్మాత ఈ సినిమాని అర్జెంటుగా విడుద‌ల చేయాల‌నుకొంటున్నాడు. మే 10న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. జ‌గ‌ప‌తి మాస్ పాత్ర పోషించిన జ‌గ‌త్‌ జంత్రీ సినిమానీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. మ‌రి లెజెండ్ ఊపుని ఈ సినిమాలు నిల‌బెడ‌తాయో, మొత్తానికి కూల్చెస్తాయో ప్రేక్ష‌కులే చెప్పాలి.