Site icon TeluguMirchi.com

చరణ్ కు తండ్రి దొరికాడు!

Jagapathi Babu as a Father role-02

రామ్ చరణ్ – కృష్ణ వంశీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే చరణ్ కు తాతయ్యగా రాజ్ కిరణ్, బాబాయిగా శ్రీకాంత్ ఓకే అయ్యారు. తాజాగా, చరణ్ కు తండ్రి కూడా దొరికాడు. జగపతిబాబు చరణ్ తండ్రిగా నటించనున్నారు. చాలా ప్రాధాన్యం వున్న పాత్ర కావడంతో జగపతిబాబు అడగగానే ఓకే అనేశాడట. త్వరలోనే జగపతి బాబు షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఇక, చరణ్ కు కుటుంబమంతా దొరికేసినట్టే!

Exit mobile version