చిత్రసీమ ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న టికెట్ ధరల అంశానికి తెర దించారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంచాలని గత కొద్దీ నెలలుగా చిత్రసీమ జగన్ సర్కార్ ను అడుగుతుంది. రీసెంట్ గా చిరంజీవితో పాటు పలువురు హీరోలు, దర్శకులు నేరుగా జగన్ వద్దకు వెళ్లి అడిగారు.
అప్పుడు సానుకూలంగా స్పందించడం తో భీమ్లా నాయక్ రిలీజ్ టైం సరికి టికెట్ ధరలు పెరుగుతాయని అనుకున్నారు కానీ పెంచలేదు. దీంతో మిగతా సినిమాల నిర్మాతలు టెన్షన్ పడ్డారు కానీ ముఖ్యమంత్రి ధరల పెంపు ఫైల్ ఫై సంతకం పెట్టి వారిలో ఆనందం నింపారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ ప్రకటన అధికారికంగా రాబోతుంది. ఇక రాధే శ్యామ్ సినిమా యూనిట్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.