జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎస్మా ప్రయోగం

కరోనా వైరస్‌ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులను తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి అన్ని వైద్య సేవలను తీసుకొచ్చింది. అత్యవసర సేవల్లో పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవోలో వెల్లడించింది.

ఇదీలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని తెలిపింది.