‘జగమే తంత్రం’ ఫస్ట్ లుక్

ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం.. ‘డి 40’ (ధనుష్) ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా ను తెలుగు లో గీత ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో ధనుష్ పంచె కట్టు తో కనిపించి ఆకట్టుకునాన్డు. ఈమూవీ లో ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయన పక్కన ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్. సమ్మర్ స్పెషల్‌గా 2020 మే 1న తమిళ్, తెలుగు భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. సంగీతం : సంతోష్ నారాయణన్, కెమెరా : శ్రీయాస్ కృష్ణ, ఎడిటింగ్ : వివేక్ హర్షన్.