లాక్ డౌన్ కారణంగా సర్వం నిలిచిపోయింది. ప్రపంచం ఎక్కడికక్కడ స్తంబించిపొయింది. దీంతో చాలా మంది ఫ్యామిలీలకు దూరం అయ్యారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఈ లిస్టు లో వుంది. కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో తన తల్లిదండ్రుల గురించి ఎంతో ఆందోళనకు గురవుతున్నట్టు ఫెర్నాండేజ్ చెప్పింది.
ప్రస్తుతం జాక్వెలిన్ ముంబయిలో ఉండగా.. ఆమె తల్లిదండ్రులు బహ్రెయిన్‌లో ఉంటున్నారు. తాన గురించి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నా వారందరూ ఎంతో అదృష్టవంతులని, సినిమా సెట్స్‌కి వెళ్లలేను కాబట్టి సోషల్‌మీడియా వేదికగా నా అభిమానులతో టచ్‌లో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు జాక్వెలిన్.