Site icon TeluguMirchi.com

‘జబర్దస్త్’ ఆడియో రిలీజ్ డేట్

Jabardasths-first-look-out

నందిని రెడ్డి దర్శకత్వం లో సిద్దార్థ మరియు సమంత జంటగా రూపొందుతున్న సినిమా ‘జబర్దస్త్’. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 27న విడుదల చేయనున్నారు. మొదటి సినిమా అలా మొదలైంది తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న నందిని రెడ్డి ఈ సినిమా కూడా అద్భుతంగా
రూపొందించిందని  సిద్ధార్థ్ తన ట్విట్టర్  ఎకౌంటులో  పేర్కొన్నాడు. జబర్దస్త్ సినిమా చూశానని, నందిని రెడ్డి తనకి మర్చిపోలేని సినిమా ఇచ్చిందని, తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఈ చిత్రంలో నిత్యా మీనన్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.  శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version