సరిలేరు లో జబర్దస్త్ కామెడీ హైలైట్ గా ఉంటుందట..

బుల్లితెర ఫై మాత్రమే కాదు వెండితెర ఫై కూడా జబర్దస్త్ బ్యాచ్ గట్టిగానే నవ్విస్తున్నారు. తాజాగా వీరు సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో కామెడీ చేశారట..ఆ కామెడీ మాములుగా ఉండదని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ముందు నుండి కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ యాంగిల్ తో పాటు కామెడీ యాంగిల్ కూడా గట్టిగానే రాసుకుంటాడు. ఈయన సినిమాల్లో ఫుల్ గా వినోదం ఉంటుందని ప్రతి ఒక్కరు అంటారు.

తాజాగా ఈయన మహేష్ తో చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ లో కూడా 39 నిమిషాల పాటు సాగే కామెడీ ఉంటుందట. ఈ ట్రయిన్ జర్నీలోనే హీరోయిన్ ఫ్యామిలీ అంతా కలిసి హీరోను పడేసి, అమ్మాయి (రష్మిక)ను కట్టబెట్టేందుకు చేసే ఫన్నీ ఫీట్లు, ఒక ఫైట్ కూడా వుంటాయని సమాచారం. అలాగే ఈ ఎపిసోడ్ లో జబర్దస్త్ బ్యాచ్ చమ్మక్ చంద్ర, అప్పారావుల సీన్లు హిలేరియస్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వాళ్ల ఎపిసోడ్ లు ఫుల్ మాస్ ఎంటర్ టైన్ గా వుంటాయని, దొంగగా బండ్ల గణేష్ కూడా మాంచి కామెడీ పండించాడని అంటున్నారు.