Site icon TeluguMirchi.com

బాల‌య్య సినిమాలోనూ ఐటెమ్‌

item song in legendదేవిశ్రీ ప్రసాద్ సినిమా అంటే ఐటెమ్ ద‌రువులు ఉండాల్సిందే. ప్రత్యేక గీతాల‌కు ఆయ‌న ఫేమ‌స్ కూడా. బాల‌కృష్ణ సినిమాకి తొలిసారి సంగీతం అందిస్తున్నారు. ఇక ఐటెమ్ మోత లేక‌పోతే ఎలా..?? అందుకే లెజెండ్‌ లోనూ ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించే ప‌నిలో ఉన్నారు దేవిశ్రీ  ప్రసాద్. బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం లెజెండ్‌. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయ‌న ఐటెమ్ పాట‌కు ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు. బాల‌య్య కెరీర్‌ లోనే గుర్తిండిపోయేలా ఓ మాస్ గీతాన్ని రూపొందించాల‌ని డీఎస్‌ పీ ఆలోచ‌న‌. జ‌న‌వ‌రి 1న లెజెండ్ ఫ‌స్ట్ లుక్‌ ని బ‌య‌ట‌కు తీసుకొస్తారు. మార్చిలో సినిమాని విడుద‌ల చేస్తారు.

Exit mobile version