దేవిశ్రీ ప్రసాద్ సినిమా అంటే ఐటెమ్ దరువులు ఉండాల్సిందే. ప్రత్యేక గీతాలకు ఆయన ఫేమస్ కూడా. బాలకృష్ణ సినిమాకి తొలిసారి సంగీతం అందిస్తున్నారు. ఇక ఐటెమ్ మోత లేకపోతే ఎలా..?? అందుకే లెజెండ్ లోనూ ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించే పనిలో ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం లెజెండ్. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐటెమ్ పాటకు ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే గుర్తిండిపోయేలా ఓ మాస్ గీతాన్ని రూపొందించాలని డీఎస్ పీ ఆలోచన. జనవరి 1న లెజెండ్ ఫస్ట్ లుక్ ని బయటకు తీసుకొస్తారు. మార్చిలో సినిమాని విడుదల చేస్తారు.