Site icon TeluguMirchi.com

ఇస్మార్ట్ శంకర్ రోల్ ఇదేనా..?

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ని జులై 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .

ఈ నేపథ్యంలో ఈ చిత్రం లో శంకర్ రోల్ ఇదే అంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. రామ్ పాత్ర మైండ్ స్వాపింగ్ కు గురవుతుంది. అంటే శరీరం తనదే అయినప్పటికీ మెదడు మాత్రం ఏదో చిప్ వల్ల అనూహ్య మార్పులు చెంది పూర్వ జీవితానికి సంబంధం లేకుండా ప్రవర్తించడం. అందుకే ఇంకో పేరుతో ఉన్న మాములు వ్యక్తి ఐస్మార్ట్ శంకర్ గా విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. మరి ఈ టాక్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Exit mobile version