గతంలో పలు సార్లు ఛార్మీ తమకు రావాల్సిన మొత్తం ఇవ్వాలంటూ పలువురు బయ్యర్లను పదే పదే కోరగా వారిలో కొందరు ఇవ్వగా కొందరు మాత్రం ఇంకా ఇవ్వకుండా నాన్చుతున్నట్లుగా తెలుస్తోంది. మొదట ఒప్పందం చేసుకున్నదాని ప్రకారం వారు ఇవ్వాల్సి ఉన్నా కూడా వారు మాత్రం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అలా ఇస్మార్ట్ శంకర్‌కు ఇంకా 10 కోట్ల వరకు వస్తాయని నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బయ్యర్లు ఎప్పుడు దయతలిచి ఇచ్చేనో చూడాలి. మరో వైపు విజయ్ దేవరకొండతో పూరి సొంత బ్యానర్లో సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమాకు కూడా ఛార్మీ ప్రొడక్షన్ వర్క్ చూసుకోనుంది.