పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్‌ను దక్కించుకున్నాడు. సినిమా విడుదలైన మొదటి రోజు వచ్చిన టాక్‌కు ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్‌కు అసలు ఎక్కడ పొంతన ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంకు యావరేజ్ టాక్ వచ్చింది. దాంతో 30 నుండి 40 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని అంతా భావించారు. కాని మొదటి వారంలో ఏకంగా 50 కోట్లను వసూళ్లు చేసింది. ఇక ఇంతటితో పూర్తి అయినట్లే అనుకుంటే మరో మైలు రాయిని ఇస్మార్ట్ శంకర్ చేరింది.
మొదటి 8 రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 61 కోట్లను వసూళ్లు చేసింది. తక్కువ సమయంలో 60 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన అతి కొన్ని చిత్రాల జాబితాలో ఇస్మార్ట్ శంకర్ కూడా చేరడం జరిగింది. నేడు విడుదలైన డియర్ కామ్రేడ్‌కు మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో శంకర్ జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే సినిమా 75 కోట్ల వరకు లాక్కెల్లే అవకాశం ఉంది.