ఇస్మార్ట్ మూడో వారంలో కూడా తగ్గట్లే..

ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలోను కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. రామ్ – పూరి కలయికలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన నాటి నుండే మంచి టాక్ తో అదిరిపోయే కలెక్షన్లను రాబడుతూ వస్తుంది. మొదటి వారం తర్వాత కాస్త తగ్గినట్లు అనిపించినా డియర్ కామ్రేడ్ టాక్ తో మళ్లీ పుంజుకుంది. వీకెండ్ లోనే కాదు మాములు రోజుల్లో కూడా హౌస్ ఫుల్ తో రన్ అవుతూ అందర్నీ ఆశ్చర్యం లో పడేస్తుంది. తాజాగా మూడో వారంలో అడుగుపెట్టిన ఇస్మార్ట్..అదే జోరు కొనసాగిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ,ఏపీలో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టింది ఇస్మార్ట్ శంకర్. కర్ణాటకలో ఈ సినిమా రూ. 1.45 కోట్లను ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ. కోటి వరకు రాబటట్టింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ 14 రోజుల్లోనే 35.51 కోట్లు వ‌సూలు చేసిందంటే బాక్సాఫ‌స్ ద‌గ్గ‌ర ‘ఇస్మార్ట్ శంక‌ర్’ ర‌చ్చ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో మంచి విజయం దక్కడంతో రామ్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. రీసెంట్ గా అమెరికా నుండి వచ్చిన రామ్ ఇస్మార్ట్ పార్టీ చేసుకొని ఇంకాస్త ఖుషీగా ఉన్నాడు .