యూట్యూబ్ లో సంచలనం రేపిన రామ్..

రామ్ – పూరి కలయికలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఊర మాస్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించి రామ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు వరుస ప్లాపులు ఎదురుకుంటున్న పూరి కి మళ్లీ ఊపిరి పోసింది. కేవలం హీరో , డైరెక్టర్లకే కాదు ఈ సినిమా కు పనిచేసిన హీరోయిన్లకు , మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కు ఇలా చాలామందికి మళ్లీ లైఫ్ ని ఇచ్చింది. తాజాగా ఇప్పుడు యూట్యూబ్ లో సంచలంగా మారింది.

ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. 24 గంటల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సినిమాకు ఏకంగా 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో తెరపై సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్, హిందీలో యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ వ్యూస్ చూసి అక్కడి దర్శక , నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఈ మధ్య మన తెలుగు సినిమాలు హిందీ లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇస్మార్ట్ తో మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసిపోయింది.