Site icon TeluguMirchi.com

రౌడీతో పూరి చొక్కా విప్పిస్తాడా?

విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాధ్‌ల కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు అధికారిక ప్రకటన రావడంతో పుకార్లకు, వార్తలకు చెక్‌ పెట్టినట్లయ్యింది. ఇక కొత్త తరహా వార్తలు మరియు పుకార్లు ఇప్పుడు పుట్టుకు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండతో ఎలాంటి కథను తీసుకుని పూరి సినిమా తీయబోతున్నాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్‌ దేవరకొండతో మరీ మాస్‌ సినిమా తీస్తే ఆయన లేడీ ఫాలోవర్స్‌ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలా కాదని క్లాస్‌ సినిమా తీస్తే యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవ్వడం కష్టం.

ఇలాంటి పరిణామాల మద్య పూరి ఎలాంటి కథను విజయ్‌ దేవరకొండ కోసం రెడీ చేస్తున్నాడనే విషయం పక్కన పెడితే పూరి ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో చొక్కా విప్పిస్తాడనే టాక్‌ కూడా వినిపిస్తుంది. పూరి తన సినిమాల్లో ఎక్కువ శాతం హీరోలతో చొక్కాలు విప్పించాడు. ఇప్పుడు అదే తరహాలో విజయ్‌ దేవరకొండతో కూడా విప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. విజయ్‌ దేవరకొండకు చొక్కా విప్పి సిక్స్‌ ప్యాక్‌ చూపించాలనే ఆసక్తి ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఒక యాడ్‌ షూట్‌ కోసం చొక్కా విప్పిన విజయ్‌ దేవరకొండ కాస్త కండలు పెంచి సిక్స్‌ ప్యాక్‌ చేసి చొక్కా విప్పితే సినిమా స్థాయి పెరుగుతుంది కదా అని కొందరు అంటున్నారు.

Exit mobile version