రాంగోపాల్ వర్మ బొత్తిగా కమర్షియల్ అయిపోయాడని ఆయన అభిమానులే నొచ్చుకొంటున్నారు. మనీపై శ్రద్ధతో సినిమాని మనసు పెట్టి తీయడం లేదని కంప్లైంట్లు ఇస్తున్నారు. దాంతో వర్మ కూడా స్వీయ విమర్శ చేసుకొంటున్నాడట. ఈసారి తప్పకుండా ఓ మంచి సినిమా తీయాలని శపథం పూనాడట. ప్రస్తుతం వర్మ మంచు విష్ణుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నాడట వర్మ. ఆయన టేకింగ్ స్టైల్ మోహన్ బాబునీ అమితంగా ఆకట్టుకొంటోందట. వర్మ సూపర్ గా సినిమా తీస్తున్నాడు, ఐదొందల సినిమాల్లో నటించాను గానీ, ఇలాంటి టేకింగ్ నేనెక్కడా చూడలేదని మోహన్ బాబు కాంప్లిమెంట్ ఇస్తున్నాడట. అంతేకాదు… ఈ సినిమాపై శ్రద్ధ పెట్టిన వర్మ తనకు ఇష్టమైన వోడ్కాను కూడా వదలేశాడట. వర్మ మారితే, ఓ హిట్ సినిమా తీస్తే.. మళ్లీ ఆయన్ని యావత్ చిత్ర పరిశ్రమా నెత్తిన పెట్టుకోదూ.. వర్మా… క్యారీ ఆన్!!