రాజ‌మౌళి న‌టిస్తున్నాడా?

ss-rajamouliద‌ర్శక ధీరుడు… ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కెమెరా ముందుకు రాబోతున్నారా? బాహుబ‌లిలో ఆయ‌నా న‌టిస్తున్నారా? ప్రస్తుతం చిత్ర ప‌రిశ్రమ‌లో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. త‌న సినిమాల్లో ఛ‌మ‌క్ మ‌ని మెరిస్తుంటారు రాజ‌మౌళి. లిప్తకాల పాటులో వ‌చ్చివెళ్లిపోయే రాజ‌మౌళిని వెండి తెర‌పై గుర్తించ‌డం క‌ష్టమే. ఈసారి మాత్రం ‘బాహుబ‌లి’లో పూర్తిస్థాయి పాత్రలో న‌టిస్తున్నార‌ని స‌మాచారం. దీని కోసం ఆయ‌న మీస క‌ట్టు కూడా మార్చుకొన్నార‌ట‌. నిజంగా ఈ సినిమాలో గ‌నుక జ‌క్కన్న న‌టిస్తే… ‘బాహుబ‌లి’కి ప్రత్యేక ప్యాకేజీ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.