Site icon TeluguMirchi.com

ఈ క‌ల‌యిక నిజ‌మ‌వుతుందా?

ram-charan(1)శ్రీ‌నువైట్ల చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవిని చూడాల‌నే… ఆయ‌న ఫిల్మ్‌న‌గ‌ర్‌ లో అడుగుపెట్టార‌ట‌. అలాంటిది ఏకంగా చిరుతో సినిమానే తీసేశారు… అదే ‘అంద‌రివాడు’. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో మెగా హీరోల‌తో సినిమాలు చేసే ఛాన్స్ రాలేదు. చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ప‌వ‌న్‌… ఇలా ఒక్క‌రితోనూ శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ సెట్ అవ్వ‌లేదు. ఇప్పుడు ఇంత‌కాలానికి మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే రామ్‌ చ‌ర‌ణ్‌ తో శ్రీ‌నువైట్ల ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. ’ఆగ‌డు’ షూటింగ్ జ‌రుగుతుండ‌గానే… చ‌ర‌ణ్ కోసం ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్ క‌థ‌ని సిద్ధం చేసేశాడ‌ట‌. చ‌ర‌ణ్ కూడా శ్రీ‌నువైట్ల‌తో సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నాడ‌ని టాక్‌. అంద‌రి వాడు వైఫ‌ల్యాన్ని ఫ్యాన్స్ మ‌ర్చిపోవాలంటే.. శ్రీ‌నువైట్ల ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందే. అయితే.. క‌థ‌ని ఓకే చేయాల్సింది మాత్రం చిరునే. త‌న‌కు కోలుకోలేని ఫ్లాప్ ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌ని చిరు రానిస్తాడా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. మ‌రి ఈ క‌ల‌యిక‌ల నిజ‌మ‌వుతుందంటారా..?? నిజ‌మైనా.. ఈ కాంబినేష‌న్ క్లిక్ అవుతుందంటారా..?

Exit mobile version