గొల్ల‌భామా? ఆర‌డుగుల బుల్లెట్టా?

gollabhamaనాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌ తేజ్ ఎట్ట‌కేల‌కు కెమెరా ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని మ‌హా శివ‌రాత్రి రోజున (ఈనెల 27) ప్రారంభించ‌బోతున్నారు. వెంట‌నే సెట్స్ పైకి వెళ్లిపోతుంది. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో క‌న్‌ఫ్యూజ‌న్ ఉంది. శ్రీ‌కాంత్ అడ్డాల ఈ చిత్రానికి ‘గొల్ల‌భామ’ అనే పేరు పెట్టుకొన్నాడు. ముందు నుంచీ అదే కొన‌సాగుతోంది. అయితే నాగ‌బాబు మాత్రం టైటిల్ మార్చండి.. అంటున్నాడ‌ట‌. మాస్ టైటిల్ అయితే త‌న త‌న‌యుడి ఎంట్రీ ప‌ర్‌ ఫెక్ట్‌ గా కుదురుతుంద‌ని ఆయ‌న ఫీల‌వుతున్నారు. ‘అత్తారింటికి దారేది’ లోని సూప‌ర్ హిట్ పాట, ఆర‌డుగుల బుల్లెట్ అనే టైటిల్ ఈ సినిమాకి ఫిక్స్ చేయ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఈ టైటిల్ బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ ద‌గ్గ‌రుంది. ప‌వ‌న్ అడిగితే టైటిల్ ఇవ్వ‌డానికి ఆయ‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. అయితే శ్రీ‌కాంత్ అడ్డాల‌ని ఒప్పించ‌డ‌మే కాస్త క‌ష్టం. మ‌రి టైటిల్ మార్చ‌డానికి ఈ డైరెక్ట‌ర్ ఏమంటాడో?