Site icon TeluguMirchi.com

ఏజెంట్ నుంచి ‘ది గాడ్’ గా డినో మోరియా పరిచయం


యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఏజెంట్’ లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా కనిపిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ రోజు, ఏజెంట్ నుంచి డినో మోరియాను ‘ది గాడ్’ గా పరిచయం చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో తన పాత్రలకు పేరుపొందిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా..చేతిలో మెషిన్ గన్‌తో పోస్టర్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతని పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం , ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డెడ్లీ గా ప్రజెంట్ చేస్తున్నాయి.

ఇక హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version