ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎసకేఎన్ నిర్మించాడు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఇలా సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది.
ఇకపోతే జూలై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. అంతేకాదు నిర్మాత ఎస్‌కేఎన్, ఆనంద్, వైష్ణవి, విరాజ్ అశ్విన్‌లు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే హీరో ఆనంద్ దేవరకొండ ఇందులో ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు. దీంతో బేబీ సినిమా ప్రమోషన్స్ కోసం వందల ఆటోలు కలిసి ముందుకు వచ్చాయి.
ఆటోలన్నీ ఏకమై సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటించాయి. జూలై 14న బేబీ విడుదల కాబోతోందంటూ వరుస క్రమంలో ఆటోలను పెట్టి వినూత్నంగా ప్రమోషన్స్ చేయించారు మేకర్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
AUTOmatic LOVE
100’s of Autos Joined in this Huge #BabyTheMovie Release Date Formation
You all gonna surely fall in love with our #Baby Soon in theatres near you from JULY 14th!
#BabyOnJuly14th
@ananddeverkonda @iamvaishnavi04 @viraj_ashwin @sairazesh… pic.twitter.com/bxSo8RsqkC
— Shreyas Media (@shreyasgroup) July 10, 2023