Site icon TeluguMirchi.com

రాజమండ్రి లో సందడి చేయబోతున్న భారతీయుడు..

కమల్ హాసన్ – శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం గ్రాండ్ గా షూటింగ్ మొదలైనప్పటికీ..ఆ తర్వాత బడ్జెట్ లో తేడాలు రావడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గా అన్ని చర్చలు జరిపి ..షూటింగ్ ను మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారం నుండి రాజమండ్రిలో ప్రారంభం కాబోతోందట. ఈ విషయాన్ని కాజల్ కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓ షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పాటు రకుల్ కూడా నటిస్తుంది.ఆ అలాగే హీరో సిద్దార్థ్ సైతం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

Exit mobile version