పవన్ కి బిగ్ ఫ్యాన్ ని!

pawan(1)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రేణుదేశాయ్ ప్రసంశల వర్షం కురిపించింది. పవన్-రేణు కలసి నటించిన తొలి చిత్రం బద్రీ. బద్రీ టైమ్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా విడుదలై నేటితో 14 సంవత్సారాలు పూర్తిచేసుకొంది. ఈ సందర్భంగా.. బద్రీనాటి అనుభవాలను అభిమానులతో పంచుకొంది రేణు. “పవన్ కు నేను బిగ్ ఫ్యాన్ ని, పవన్ సినిమాలను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. చూస్తుంటానని” పేర్కొంది. రియల్ లైఫ్‌ లోనూ పవన్‌కు భాగస్వామిని అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక, బద్రీలో పవన్ ప్రక్కన అవకాశం ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది రేణు. కాగా, ప్రేమ వివాహంతో ఒక్కటైన పవన్-రేణు ఇటీవలే విడిపోయిన విషయం తెలిసిందే.