Site icon TeluguMirchi.com

నేను పడకగది ముచ్చటే ఎత్తలేదు

iliyanaనడుం అందాలను తనదైన రీతిలో వెండితెరకు పరిచయం చేసిన గోవా బ్యూటి ఇలియానాకు ప్రస్తుతం ఎక్కడా పెద్దగా అవకాశాలు లేవు. ఈ అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుని హిందీలోకి వెళ్లగా అక్కడ నిరాశే మిగిలింది. అవకాశాలను కావాలని నేను అడుక్కోను, అంత కర్మ నాకేం పట్టలేదు అంటూ గడుసుగా మాట్లాడిన ఈ సుందరి అవకాశాల కోసం పడక గదికి వెళ్లనక్కర్లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేసిందని తెగ ప్రచారం అయ్యింది. పడక గదికి వెళితేనే అవకాశాలు వస్తాయి అని కూడా ఇల్లీ చెప్పిందనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న ఇలియానా ఆ కామెంట్లపై షాకింగ్‌గా స్పందించింది.

అసలు తాను పడక గది ముచ్చటే ఎత్తలేదని, తనకు అలాంటి పరిస్థితులే కలగలేదని ఇల్లీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఫలానా ఇంటర్య్వూ అని మీరు చెబుతున్న సమయంలో నేనిక్కడ లేనే లేను, ఫారెన్‌ దేశాలలో ఉన్నాను, చెప్పిన విషయాలను మార్చి మార్చి రాస్తారు అని విన్నా కానీ, అసలు చెప్పక ముందే ఇలా క్రియేట్‌ చేసి పేరు కూడా రాస్తారా బాసు అంటూ తనదైన రీతిలో స్పందించింది. ఎంచక్కా అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు నేను అనలేదు అంటూ మాట మారుస్తున్న ఇలియానా తీరును చూసి మీడియా వారు షాకవుతున్నారు. అన్నీ తానే గడుసుగా చెప్పేసి ఇప్పుడు మాట మారిస్తే ఊరుకుంటామా అని మీడియా ఇల్లీపై గరం అవుతున్నారు.

Exit mobile version