ఆ అమ్మాయిలు అమ్మడుపోయారు

Iddarammayilathoఫారెన్ మార్కెట్‌ పై తెలుగు సీమ ఆధార‌పడి ఉంద‌నేది వాస్తవం. అక్కడ ఎక్కవ రేట్లకు సినిమాలు అమ్మి… ఆర్థికంగా లాభ‌ప‌డ‌దామ‌ని ద‌ర్శక నిర్మాత‌లు ఆలోచిస్తున్నారు. మ‌హేష్‌ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్రభాస్ సినిమాల‌కు అక్కడ మంచి రేటు ప‌లుకుతుంది. జులాయితో.. అల్లు అర్జున్ కూడా అక్కడి మార్కెట్‌ లో పాగా వేశాడు. ‘ఇద్దర‌మ్మాయిల‌తో’ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ రూ.3 కోట్లకు అమ్మడుయ్యాయ‌ని స‌మాచారం. బ‌న్నీ గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. ఇది కోటి రూపాయ‌లు ఎక్కవే గిట్టాయి. పూరికి ఉన్న క్రేజ్‌, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమాకి ప్రధాన బ‌లం. ఈనెలాఖ‌రున‌… ‘ఇద్దర‌మ్మాయిల‌తో’ విడుద‌ల చేయ‌నున్నారు.