అమ్మాయిలు వ‌స్తున్నారోచ్‌!

iddarammailathoఅనుమానాలు ప‌టాపంచ‌లైపోయాయి. ‘ఇద్దర‌మ్మాయిల‌తో’ సినిమా ఈనెల 24న వ‌స్తుందా? రాదా? అని బ‌న్నీ అభిమానులు తెగ గాబరా ప‌డియారు. వారంద‌రికీ బండ్ల గ‌ణేష్ ఓ కూల్ న్యూస్ చెప్పాడు. ఈ సినిమాని ఎట్టి ప‌రిస్థితిల్లోనూ 24న తీసుకొచ్చేస్తున్నాం.. అని ప్రక‌టించేశాడు. పూరి-బన్నీ కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న రెండో సినిమా ఇది. దేవిశ్రీ సంగీతం అందించాడు. దాంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. నిజానికి ఈనెల 10న ఈ సినిమా విడుద‌ల కావాల్సింది. అయితే… రెండు వారాలు ఆల‌స్యంగా దించుతున్నారు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు ఆల‌స్యం అవుతూ వ‌స్తున్నాయ‌ని.. అందుకే మ‌రో వారం ఈ సినిమా లేట్‌ గా వ‌స్తుంద‌నే ఊహాగానాలు వినిపించాయి. దానికి గ‌ణేష్ ఈరోజు తెర‌దించేశాడు. సో.. బ‌న్నీ ఫ్యాన్స్ కాచుకోండిక‌.