Site icon TeluguMirchi.com

అమ్మాయిల‌కు క‌త్తెర్లు ప‌డ‌తాయా?

iddarammailathoమొత్తమ్మీద ఇద్దర‌మ్మాయిల‌తో డేట్ ఫిక్సయ్యింది. ఈనెల 24న రావ‌డం ఖాయ‌మైంది. ఈలోగా జ‌ర‌గ‌వ‌ల‌సిన కార్యక్రమం ఒక‌టుందిగా..! అదే సెన్సార్‌. ఈనెల 17న ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్లనుంది. పూరి సినిమాల్లో శృంగారం మోతాదు మించ‌దు. ఆ విష‌యంలో ఈ సినిమాకీ మిన‌హాయింపు లేక‌పోవ‌చ్చు. కానీ యాక్షన్ మాత్రం ఈ సినిమాలో హై రేంజులో ఉంది. ఫైట్ మాస్టర్ కిచ రూపొందించిన ఫైట్లు… ర‌క్తపాతంలో మునిగిపోయాయ‌ట‌. ట్రైల‌ర్‌ లో బ‌న్నీ ఓ రౌడీని క‌సి క‌సిగా పొడిచేస్తున్నాడు. ఇలాంటి షాట్లు ఈ సినిమాలో మ‌రిన్ని ఉండే అవ‌కాశం ఉంది. వాట‌న్నింటికీ క‌ట్‌ లు ప‌డే అవ‌కాశం ఉంది.

Exit mobile version