Site icon TeluguMirchi.com

పాట‌లు ఓ మోస్తరుగా ఉన్నాయంతే!

Iddarammayilathoఇంకేముంది? దేవీశ్రీ ప్రసాద్ కుమ్మేస్తాడు. బ‌న్నీ సినిమా అన‌గానే రెచ్చిపోయే ట్యూన్లు ఇచ్చేస్తాడు. అందులోనూ పూరి జ‌గ‌న్నాథ్ హ్యాండు ఉంటుంది. ఇక ఇద్దర‌మ్మాయిల‌తో పాట‌ల‌తో టాలీవుడ్‌ టాప్ లేచిపోద్ది… అనుకొన్నారంతా. కానీ ఆ పాట‌లు ఆశ‌లు పెట్టుకొన్నంత రేంజులో లేవు. దేవీ మ్యాజిక్ అంత‌గా క‌నిపించ‌లేద‌ని మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంటున్నారు. ఈ సినిమా పాట‌ల‌పై ఫ్యాన్స్ చాలా నమ్మకాలు పెట్టుకొన్నారు. వాటికి 50 % మాత్రమే పాట‌లు రీచ్ అయ్యాయి. విన‌డానికి బాగున్నా – మ‌ళ్లీ మళ్లీ వినాల్సిందే అనేంత కిక్ ఇవ్వలేక‌పోయాయి. టాప్ లేచిపోద్ది అనే ఐటెమ్ పాట కూడా ఓ మోస్తరుగా ఉంది. పాట‌ల్లో ఎక్కువ‌గా ఇంగ్లీష్ ప‌దాలు దొర్లాయి. ర‌న్ ర‌న్‌, గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా ఓ మోస్తరుగా ఉన్నాయి. వ‌యెలిన్‌ తో టీజ‌ర్‌లో అద‌ర‌గొట్టిన పాట‌… ఆ బిట్ వ‌ర‌కూ మాత్రమే ఆక‌ట్టుకొంది. సాహిత్యంలో అబ్బుర ప‌రిచే ప‌ద ప్రయోగాలేం లేవు. ఏతావాతా ఇదో ఏవ‌రేజ్ ఆల్బమ్. కానీ పూరి టేకింగ్‌, బ‌న్నీ స్టెప్పులూ ఈ పాట‌ల‌కు కొత్త క‌ల‌రింగ్ ఇస్తాయేమో చూడాలి.

Exit mobile version