తన 20 ఏళ్ల ప్రస్థానంపై బన్నీ పోస్ట్ !


దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “గంగోత్రి” సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. కేవలం అభిమానులు నుంచి ప్రశంసలు మాత్రమే కాకుండా బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డ్ ను దక్కించుకుని ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. నేటికీ అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమా 20 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ 20 ఏళ్ళ అల్లు అర్జున్ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి.

ఇకపోతే తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంపై స్పందించిన బన్నీ.. “ఈరోజు నేను 20 ఏళ్ళు సినీ పరిశ్రమలో కంప్లీట్ చేసుకున్నాను. నాపై మీరు చూపించిన ప్రేమకి చాలా ఆనందంగా ఉందని, అలాగే పరిశ్రమకు చెందిన నా వారందరికీ నేను కృతజ్ఞుడను. నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఫ్యాన్స్, నా మంచి కోరుకునేవారు, ఆడియెన్స్ వల్లనే అని వారికి ఎప్పటికి నేను ఋణ పడి ఉంటాను” అని పోస్ట్ చేసాడు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ “పుష్ప2” సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.