Site icon TeluguMirchi.com

అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో అల్లు అర్జున్..


ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఈ లోపే ‘క్రేజీ’ కాంబో ఫిక్స్ అయిపోయింది.

తాజాగా అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ 2025లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. పుష్ప2తో పాటు త్రివిక్రమ్ సినిమా అయిపోయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు.

ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రీయేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు. కాబట్టి ఆ తర్వాతే బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు.

54 సెంటర్లలో ఆఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ !

Exit mobile version