Site icon TeluguMirchi.com

విజువల్ వండర్ గా వస్తున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అలవైకుంఠపురములో’ సినిమాలు రూపొందాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు మరోసారి ఈ అద్భుతమైన కాంబినేషన్ మనం వెండితెరపై మునుపెన్నడూ చూడని దృశ్యకావ్యాన్ని అందించడానికి చేతులు కలిపింది. తాజాగా ఈరోజు గురు పూర్ణిమ శుభ సందర్భంగా వీరి కాంబోలో నాలుగో సినిమా వస్తున్నట్లు అధికారకంగా వెల్లడించారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న నాలుగో సినిమాని ఈరోజు ఉదయం 10:08 గంటలకు ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు. గత చిత్రాలను మించి అత్యంత భారీ స్థాయిలో అద్భుతమైన అనుభూతిని పంచే చిత్రాన్ని అందించబోతున్నామని వీడియో ద్వారా తెలిపారు. ఇకపోతే హారిక & హాసిని క్రియేషన్స్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ నిర్మాణంలో భాగమైన ప్రసిద్ధ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం అవుతుంది. ఈ చిత్రాన్ని పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరియు శ్రీమతి మమత సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

Allu Arjun - Trivikram | The Dynamic Combo Reunite For Their 4th Film

Exit mobile version