రేసుగుర్రంలో అల్లు అర్జున్ పోలీస్‌గా కనిపిస్తాడోచ్.. అంటూ ప్రచారం సాగింది. ఇప్పుడు సినిమా బయటకు రాబోతోంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. రేసుగుర్రంలో బన్నీ పోలీస్ కాదట. ఈ విషయాన్ని బన్నీ ధృవీకరించడాడు. “ఈ సినిమాలో నేను పోలీస్‌గా కనిపిస్తానన్న మాటలు అవాస్తవం. కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్. నేను తనకి తమ్ముడిని మాత్రమే.. నా పాత్ర ఏమిటన్నది సస్పెన్స్“ అంటున్నాడు బన్నీ. అయితే ఓ ఆశయం కోసం రేసు మొదలెట్టిన యువకుడిగా మాత్రం బన్నీ కనిపించనున్నాడు. తన ప్రేమనీ. ఆశయాన్నీ గెలిపించుకోవడానికి కథానాయకుడు ఏం చేశాడన్నదే… రేసుగుర్రం కథ. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొన్న ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రుతిహాసన్, సలోని కథానాయికలు.