ఆయనతో డేటింగ్‌ చేస్తున్నానన్న హెబ్బా

hebba (2)‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్‌ ప్రస్తుతం యమ బిజీగా సినిమాలు చూస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘మిస్టర్‌’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన ఈ సినిమాలో హీరోయిన్స్‌గా లావణ్య త్రిపాఠి మరియు హెబ్బా పటేల్‌లు నటించిన విషయం తెల్సిందే. ‘మిస్టర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా హెబ్బా మాట్లాడుతూ తాను డేటింగ్‌లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రసుత్తం తన ఈ స్థాయికి కారణం అయిన వ్యక్తితో డేటింగ్‌ చేస్తున్నాను. అయితే ఆయన ఖచ్చితంగా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు అంటూ తేల్చి చెప్పింది. ఆయన అంటే నాకు గౌరవం అని, అభిమానం అంటూ చెప్పుకొచ్చింది. ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన ఎవరు అనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు అంటూ తేల్చి చెప్పింది.