సెక్స్ కోసమే పెళ్లి : సుచిత్ర తో వర్మ

ramgopal-varma-suchitraదర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఐడియాలజి, వర్మ ను ఇష్టపడే అభిమానులకు భలే ఆసక్తిగా వుంటుంది. ఆయన్ని అభిమానించే ప్రేక్షకులు వర్మ అఫ్ డేట్స్ ను గమనిస్తూనే వుంటారు. వర్మ వ్యక్తిగత విశేషాలను తెలుసుకోవడానికి మరింత ఆసక్తి చూపిస్తారు. వర్మ కుడా వాళ్ళను నిరుస్సహ పరచకుండా తరుచుగా ఆసక్తి కరమైన కామెంట్స్, తన వ్యక్తి గత విషయాలను పంచుకుంటుటాడు. ఈ వరుసలో తాజాగా వర్మకు సంబంధించి మరో వ్యక్తిగత విషయం బయటకు వచ్చింది. అయితే ఈ విషయం వర్మబయటపెట్టలేదు. వివరాల్లోకి వెలితే…

ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటి సుచిత్రా కృష్ణ మూర్తి తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ ‘డ్రామా క్వీన్’ అనే పుస్తకం ఇటీవల విడుదల చేసింది. గతంలో సుచిత్ర, రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘మై వైఫ్స్ మర్డర్’ , రాన్ వంటి పలు చిత్రాల్లో నటించింది.

ఆ పుస్తకంలో వర్మ, సుచిత్ర కు సంభదించి ఓ వ్యక్తిగత విషయం వుంది. ఓ సారి సుచిత్రా రామ్ గోపాల్ వర్మకు పెళ్లి ప్రపోజల్ చేసిందట. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ వర్మ ఓ మెసేజ్ పంపిందట . ఆ మెసేజ్‌తో వర్మ ఆమెను కలిసి షాకింగ్ కామెంట్స్ చేశాడు . వర్మ అలా మాట్లాడటంతో షాకైన సుచిత్ర…..తన మనసులోని ఉద్దేశ్యాలను వర్మ నిర్మొహమాటంగా చెప్పినందుకు సంతోషపడిందట. ఇంతకీ వర్మ, సుచిత్ర ప్రపోజల్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే?..
‘సుచిత్రా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. మన ఆలోచనలు, దృక్ఫథాలు ఒక్కటి కావు, ఎప్పటికీ కాలేవు. నాకు వివాహ బంధంపై నమ్మకం లేదు. నేను మహిళలను కేవలం సెక్స్ కోసమే ఉపయోగించుకుంటాను. నేను కేవలం మహిళల శరీరాలనే ఇష్టపడతాను వారి మెదడును కాదు’ అని నిర్మొహమాటంగా చెప్పేశాడట.

అది స్త్రీ ల పట్ల వర్మకున్న ఐడియాలజి. అయితే ఇది చాల రోజుల క్రితం మాట. ఈ వ్యక్తి గత విషయాన్ని పుస్తకం లో పెట్టడానికి సుచిత్ర, వర్మను అనుమతి అడిగిందట. వర్మ ఒప్పుకోవడంతో వర్మ ఎపిసోడ్ ను సుచిత్ర తన పుస్తకం లో ప్రస్తావించింది. అంతే…! వర్మ… ఇలాంటి విషయాలకు ‘నో’ చెబితే ఆశ్చర్యా పడాలిగాని ‘ఎస్’ చెబితే ఆశ్చర్యము ఎందుకు…