Site icon TeluguMirchi.com

చౌదరి చేతికి ‘ఐ’ తెలుగు రైట్స్ ?

I-telugu-rightsవిక్రమ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఐ’. ఇప్పుడు అందరికళ్లు ఈ చిత్రం ఫై పడ్డాయి. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఓ హాలీవుడ్ సినిమా చూసే విధంగా ట్రైలర్ ఉందని అందరు చెపుతున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 30 కోట్లకు పైగానే చెల్లించినట్టు కోలీవుడ్ టాక్.

ఒక తమిళ అనువాదానికి ఈ స్థాయిలో కొనుగోలు చేయడం పెద్ద రిస్కేనని టాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. హిట్టయితే పర్వాలేదు కానీ..అటూ ఇటూ అయితే రికవరీ కష్టమేనని మాట్లాడుకుంటున్నారు. ఈ వార్తలను ఖండించినవాళ్లూ లేకపోలేదు. గతంలో రజనీకాంత్ ‘రోబో’ సినిమాకి ఇలాగే అన్నారని, ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టిందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. మొత్తానికి ‘ఐ’ అందరిలోనూ అంచనాలు రేపుతోంది.

Exit mobile version