రికార్డుల మోత మోగిస్తున్న ‘ఐ’

i-recordsఅల్ టైం సుపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే రికార్డుల మోత మొగియడం స్టార్ట్ చేసింది.

ఈ సినిమా ట్రైలర్ కు యుట్యూబ్ లో ఇప్పటివరకు 9 మిలియన్ హిట్స్ వచ్చాయి. ఒక సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ ను ఈ స్థాయిలో నెటిజన్లు వీక్షించడం ఇదే మొదటిసారి. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ భారి బడ్జెట్ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని సినిమా ఇండస్ట్రీ కాకుండా యావత్తు ప్రపంచం ఎదురుచూస్తుంది.

ఇక జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రం యొక్క మరో ట్రైలర్ ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి యూనిట్ భావిస్తుంది. ఈ చిత్రానికి సబంధించిన తెలుగు ఆడియో ని డిసెంబర్ 15న విడుదల చేస్తునంటు సమాచారం. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో ఈ సినిమాను అనువదిస్తున్నారు.