పవన్ తో సినిమా తీయలేను: వర్మ

pavanతన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన ట్వీట్స్ చేసి వార్తల్లో వుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. పవన్ తో సినిమా మాత్రం చేయలేనని చెప్పేశాడు. వర్మ తాజా ఇంటర్వ్యూ లో పవన్ గురించి చెబుతూ … నాకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం. తను మాట్లాడుతుంటే ఓ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. తనని చూస్తుంటే ఓ వోల్కనో తనలో దాగుందేమో అనిపిస్తుంది. నిజానికి నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు. ఎవరు ఏ పార్టీనో కూడా పట్టించుకోను. కానీ ఓ కామన్‌మేన్‌గా కల్యాణ్‌ని చూస్తే ఓ బాల్‌థాకరే లాగా కరిష్మా ఉన్న లీడర్‌ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. రాజ్‌థాకరేలాగా జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేయగలడు తను. ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఎలాంటి ప్రభంజనం వచ్చిందో, తనకూ అలా వస్తుందని అన్నాడు. పవన్ తో సినిమా చేస్తారా? అన్న ప్రశ్నకు బదులు చెబుతూ..పవన్ ఫాలోయింగ్, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన అభిమానుల్ని రంజింపచేసే విధంగా సినిమా తీసే సామర్థ్యం, సెన్సిబిలిటీస్ నాకు లేవు. అందుకే నేను తీయను, తీయలేను అని తేల్చిచేప్పేశాడు.