అనసూయ సీక్రెట్ ను బయటపెట్టిన హైపర్ ఆది…

తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఆమెకు సంబందించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది.

ఈ సంగతి పక్కన పెడితే తాజాగా అనసూయ రెమ్యూనరేషన్ వివరాలను హైపర్ ఆది బయటపెట్టాడు. జబర్దస్త్‌లో అనసూయ అంద చందాలకు ముగ్ధుడైపోతూ ఆమెను పాలరాతి శిల్పంలా పూజించే ఆది.. ఈసారి ఆమె రెమ్యూనరేషన్‌ పంచ్‌లు పేల్చి ఆమె అసలు రేటును లీక్ చేశాడు. అనసూయ ఒకవైపు జబర్దస్త్ షో చేస్తూనే.. ఈటీవీలో ప్రతిరోజు పండగే, మరోవైపు జీ తెలుగులో లోకల్ గ్యాంగ్ షోలకు బాగానే మేనేజ్ చేస్తుందంటూ పంచ్‌ పేల్చుతూ.. ఆమెకు ఈవెంట్‌కు 3 లక్షలు ఇస్తారు.. మాకైతే లక్షే ఇస్తారని అనసూయ రెమ్యూనరేషన్‌తో పాటు తన రెమ్యూనరేషన్‌ను బయటపెట్టాడు.