Site icon TeluguMirchi.com

Naa Saami Ranga : ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ కోసం భారీ సెట్..


కింగ్ నాగార్జున అక్కినేని మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ సాంగ్ కోసం భారీ సెట్ ను వేశారు మేకర్స్. ప్రస్తుతం స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేతలు ఎంఎం కీరవాణి ఫుట్ ట్యాపింగ్ ట్యూన్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు.

ఇక ఈ మాస్ నంబర్‌లో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా అలరించనున్నారు. సినిమాకే పెద్ద ఆకర్షణగా నిలవనున్న ఈ పాట చిత్రీకరణలో మొత్తం 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా, దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ‘నా సామిరంగ’ 2024లో సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.

Exit mobile version