యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తున్నా అంటూ.. ఎన్టీఆర్ కి హృతిక్ బర్త్ డే విషెస్


ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. అయితే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, పలువురు సినీప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు.

‘హ్యపీ బర్త్‌డే తారక్‌.. ఈ సంతోషకరమైన రోజును నువ్వు సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. నీ కోసం నేను యుద్ధభూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంత వరకు ప్రతీ రోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ ట్వీట్ చేసాడు. ఇక దీనికి ఎన్టీఆర్ త్వరలోనే కలుద్దాం అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వార్‌-2 సినిమాలో హృతిక్‌, ఎన్టీఆర్‌ తలపడనున్నట్లు కన్ఫర్మ్ అయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.