Site icon TeluguMirchi.com

అప్పడాలు అమ్ముతున్న స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. జైపూర్‌లో అప్పడాలు అమ్ముతూ కనిపించాడు. ఇదంతా సినిమా కోసం. హృతిక్‌ ఓ ప్రయోగాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతున్నాడు

‘కాబిల్‌’ తర్వాత ఆయన ‘సూపర్‌ 30’లో నటిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. వికాస్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ గణితశాస్త్ర నిపుణుడు,సూపర్‌ 30 కోచింగ్‌ సెంటర్‌ అధినేత ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జైపూర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్‌లో హృతిక్‌ సాధారణ వ్యక్తిలా నూలు వస్త్రాలు ధరించి, భుజంపై తువాలు వేసుకుని.. బండిపై అప్పడాలు అమ్ముతూ కనిపించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Exit mobile version