Site icon TeluguMirchi.com

హృతిక్ రోషన్ కు బ్రెయిన్ సర్జరీ

hrithik-roshnబాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్‌కు బ్రెయిన్ స‌ర్జరీ జ‌రిగింది. ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు హృతిక్‌కు ఆప‌రేష‌న్ చేసిన‌ట్టు డాక్టర్లు వెల్లడించారు. గతంలో ‘క్రిష్ 3’ షూటింగ్‌లో భాగంగా సీన్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా ప్రమాద‌వ‌శాత్తూ హృతిక్ రోష‌న్ త‌ల‌కు గాయమైంది. ఆయ‌న‌కు బ్రెయిన్‌ స‌ర్జరీ చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే హృతిక్‌కు చేసిన ఆప‌రేష‌న్ చాలా చిన్నద‌ని, హృతిక్ రోషన్ కి జరిగిన సర్జరీని ‘క్రానిక్ సబ్డ్రుల్ హీమోటోమా’ అని అంటారని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని హృతిక్ తండ్రి రాకేష్ రోష‌న్ మీడియాకు వెల్లడించారు.

హృతిక్ సర్జరీ రూంలోకి వెళ్లే ముందు, ప్రపంచంలో అత్యంత సృజనాత్మకమైన మేథో శక్తికి జోహార్లు, దేవుడిచ్చిన శక్తిమంతమైన వరం బ్రైన్. కానీ ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో తప్ప అదెంత శక్తిమంతమైనదన్న విషయాన్ని గుర్తించలేం. దాని ద్వారానే చూస్తాం, వింటాం, స్ప్రుశిస్తాం, వాసన చూస్తాం, రుచీ చూస్తాం, అలాగే భయం, ధైర్యం, ఊహాశక్తి ఇవన్నీ లిఖితపూర్వకంగా అనుభవిస్తున్నానంటూ ఫేస్ బుక్ అకౌంట్ లో కామెంట్ పెట్టాడు.

Exit mobile version